Showing posts with label VV Vinayak. Show all posts
Showing posts with label VV Vinayak. Show all posts

30/06/2016

మాస్ నాయక్ కి చెర్రీ గ్రీన్ సిగ్నల్

మెగా ఫ్యామిలీ హీరోలకు దర్శకుడు వి.వి.వినాయక్ అంటే విపరీతమైన నమ్మకం. మాస్ మూవీస్ విషయంలో వినాయక్ ని మించిన నాయక్ లేడని గట్టిగా నమ్ముతారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విషయంలో ముందు నుంచి వినాయక్ పేరు వినిపించింది. చివరకు స్టోరీ సంగతి ఎలా ఎటు మారినా.. చివరకు వినాయక్ చేతిలోనే ఆ సినిమాని పెట్టారు హీరో చిరంజీవి- నిర్మాత రామ్ చరణ్. 

ఎంతమంది ఎన్ని సబ్జెక్టులు చెప్పినా తను నిర్మాతగా తీసే మొదటి మూవీకి వినాయక్ నే దర్శకుడిగా రామ్ చరణ్ ఎంచుకున్నాడు. మెగా 150కోసం నెలకొన్న పోటీని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేయగలిగాడు వినాయక్. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకున్న తర్వాత తామిద్దరం ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారణ చరణ్-వినాయక్. వీరిద్దరూ కలిసి గతంలో నాయక్ చిత్రాన్ని చేసి సక్సెస్ కొట్టిన విషయం మెగాఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది. 

అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వినాయక్ ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా మెగా 150పైనే పెట్టాడు. ఆ తర్వాతే కొత్త మూవీ స్క్రిప్ట్ పై కూచోనున్నాడు. ఇక రామ్ చరణ్ అయితే ధృవను దసరాకు తెచ్చిన తర్వాత సుకుమార్ తోను.. ఆ తర్వాత మారుతీ తోను ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. అప్పటికి గానీ వినాయక్ సినిమా సంగతి తేలే ఛాన్స్ లేదు. ఇదంతా జరగడానికి 2018 వచ్చేస్తుందేమో. 

23/06/2016

ఔను.. ఆ ‘చిరు’ మధుర క్షణాలు వచ్చేశాయ్

చిరంజీవి రీఎంట్రీ మూవీ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఆ నిరీక్షణ ఎట్టకేలకు గత ఏడాదే ఫలించి.. ఆ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అంత మాత్రాన ఉత్కంఠకు తెరపడలేదు. చిరు చేయబోయే సినిమా ఏదన్న విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. చివరికి ‘కత్తి’ రీమేక్ కు ఫిక్సయ్యారు. కానీ మళ్లీ నిరీక్షణ తప్పలేదు. స్క్రిప్టు పనుల్లో విపరీతమైన జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏప్రిల్లోఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ మళ్లీ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి మళ్లీ నిరీక్షణే. ఏవేవో కారణాలు.. ఏవేవో వార్తలు.. మెగా అభిమానుల్లో కన్ఫ్యూజన్. ఇదిగో అదిగో అంటూ రెండు నెలలు గడిచిపోయాయి. ఐతే ఎట్టకేలకు వాళ్లు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదేళ్ల విరామం తర్వాత తాను హీరోగా నటించే సినిమా కోసం మళ్లీ కెమెరాను ఫేస్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ‘కత్తిలాంటోడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తన సెంటిమెంటు ప్రకారం ముందుగా ఫైట్ సీన్ చిత్రీకరణే మొదలుపెట్టాడు దర్శకుడు వి.వి.వినాయక్. చిరంజీవి పర్ఫెక్ట్ లుక్ తో షూటింగుకి హాజరయ్యాడని.. షూటింగులో ఆయన పదేళ్లు వయసు తగ్గినట్లుగా కనిపించాడని మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన ఓ పీఆర్వో ట్విట్టర్లో వెల్లడించాడు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. ఇంకొన్ని రోజుల్లోనే దీని గురించి ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

22/06/2016

రేపే మొదలుపెడుతున్న మెగాస్టార్

మెగాస్టార్ అభిమానులు - వీరాభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న క్షణం మరికొన్ని గంటల్లోనే సాకారం కానుంది. ఈ నెల 23 నుంచి మెగాస్టార్ 150వ సినిమాకి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి సీన్ ను చిరంజీవి పైనే చిత్రీకరించేందుకు దర్శకుడు వివి వినాయక్ సిద్ధమవుతున్నాడు. 

ఇప్పటికే చిరు నటించనున్న సన్నివేశాలకు సంబంధించిన ఏర్పాట్లు జరగనున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించి జైల్ సెట్ లో రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫస్ట్ షాట్ ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న దర్శకుడు వివి వినాయక్.. ఇందుకోసం తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే తన బాడీతో సహా మేకోవర్ ని కూడా పూర్తి చేసిన మెగాస్టార్.. కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నారు. 

రేపు షూటింగ్ మొదలయ్యాక ఫస్ట్ షెడ్యూల్ ని కంటిన్యూగా పిక్చరైజ్ చేయనున్నారు. తొలి షెడ్యూల్ అంతా యాక్షన్ సీక్వెన్స్ లను తీసేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మొదటి మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి.. కత్తిలాంటోడు అనే టైటిల్ ని అనుకుంటూ ఉండగా.. ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు.