Showing posts with label Mohan Babu. Show all posts
Showing posts with label Mohan Babu. Show all posts

17/09/2016

మోహన్ బాబు చేతులమీదుగా చిరు MB40

విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మోహన్ బాబు 40వసంతాల సినీ జీవిత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సినిమా రంగానికి చెందినవారే కాకుండా - రాజకీయాలకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన అతిరథమహారధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అత్యంత ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఒక పొలిటీషియన్.. ఒక ఎడ్యుకేషనిస్ట్.. అంతకంటే మించి అందరి మంచీ కోరుకునే ఒక మంచి స్నేహితుడు.. ఆయన ఒక గొప్ప వ్యక్తి.. రేపటి తరాలకు ఒక మంచి ఇనిస్పిరేషన్.. అని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక కంఠంతో మోహన్ బాబుని కొనియాడింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు - సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం గురించి ప్రస్థావించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు... తన 40 సంవత్సరాల కేరీర్ సందర్భంగా జరిగిన కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమాన్ని తిరుపతి వేడుకగా తానే చేస్తానని ప్రకటించారు. చిరంజీవి తర్వాత వెంకటేష్ సినీ కెరీర్ కి సంబందించిన సన్మాన కార్యక్రమం కూడా తానే చేస్తానని మోహన్ బాబు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చిరంజీవి - వెంకటేష్ లిద్దరూ చిరునవ్వులు చిందించారు. అనంతరం సభాప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

MB40: చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు

ఇకపోతే ఎంబి40 ఈవెంట్లో చిట్టచివర మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ అంతా ఒకెత్తయితే.. అందులో మోగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రత్యేకం. 

''చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు. నేను కూడా ఆయనకు ఎప్పుడు చెడు చేయలేదు. మేం గ్రేట్ ఫ్రెండ్స్ అంతే.  నేను చిరంజీవితో చేసినన్ని సినిమాలు ఎవ్వరితోనూ చేయలేదు. ఇక చిరంజీవి తన తండ్రిని ఎంతో ప్రేమించేవారు.. అలాంటి ప్రేమ తన పెద్దకూతురుకు వచ్చింది. ఎక్కడ కనిపించినా అంకుల్ అని పిలుస్తుంది. అలాగే నాకు అల్లూ రామలింగయ్య గారంటే చాలా కష్టం. ఆయనంటే నాకు ఎంత ప్రేమో అరవింద్ మథర్ కు తెలుసు. ఇక అరవింద్ కూడా నాకు మంచి స్నేహితుడే. నాకు నాగబాబు అంటూ చాలా ఇష్టం. అది బయటకు తెలియదు. నా పేరు భక్తవత్సలం నాయుడు.. నేను పెద్దకాపును అన్నాను. అన్నా నువ్వా అంటూ నాగబాబు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడకు వచ్చేశాడు. చాలా మంచోడు తను'' అంటూ 'మెగా' పొగడ్తలతో ముంచెత్తారు మోహన్ బాబు.  

''షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్ చిరంజీవి. మళ్లీ అదే కాంబినేషన్ డేట్లు దొరకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. హోల్ హార్డెడ్ థ్యాంక్స్ చిరంజీవి'' అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చిరంజీవి మథర్ కు నమస్కారాలు అంటూ చెప్పిన మోహన్ బాబు.. ''చిరంజీవి మర్చిపోతాడు నువ్వు మర్చిపోవు. అమ్మకు నా నమస్కారాలు. నువ్వు ఆవిడకు తెలియజేయి'' అని సెలవిచ్చారు.

''తదుపరి 40 ఏళ్ల సన్మానం జరిగేది చిరంజీవికే. ఆ సభను నా చేతిలో పెట్టు చిరంజీవి.. నేనే ముందుండి అంతా నడిపిస్తాను. చూడు అప్పుడు. ఆ తరువాత 40 ఏళ్ల పండుగ వెంకటేష్ దే'' అంటూ ముగించారు మోహన్ బాబు. 

16/09/2016

మోహన్ బాబు కోసం మెగాస్టార్ సెలవ్

మెగాస్టార్ చిరంజీవి- మోహన్ బాబుల మధ్య వైరం ఉందో లేదో చెప్పడం కష్టం కానీ.. వీరిద్దరి మధ్య పెద్దగా సఖ్యత అయితే లేదన్న మాట వాస్తవం. మాటకు మాట అన్నట్లుగా మాట్లాడుకునే సందర్భాలు పబ్లిక్ గానే కనిపిస్తూనే ఉంటాయి. నవ్వుతూనే మాటల తూటాలు విసురుకునే వీళ్లని టామ్ అండ్ జెర్రీ టైపులో అభివర్ణిస్తూ ఉంటారు సినీ జనాలు. ఇదంతా గతం అనిపిస్తోందిపుడు. మెల్లగా ఇద్దరూ దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎంబీ40 పేరుతో మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 17న వైజాగ్ లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఖైదీ నెంబర్ 150 మూవీని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్న చిరు.. తన పాత మిత్రుడు కం ఎక్సెట్రా అయిన మోహన్ బాబు కోసం బ్రేక్ ఇచ్చేశారు. విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి నిర్వహిస్తున్న సత్కారం కార్యక్రమానికి చిరు హాజరు కానుండడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా చిరు- మోహన్ బాబు కలవడానికి ప్రధాన కారణం దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు సఖ్యత కుదర్చడమే అంటున్నారు.

మరోవైపు మోహన్ బాబు సన్మాన కార్యక్రమానికి చిరు-దాసరితో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు అనేకం హాజరు కానున్నారు.