Showing posts with label Kadapa King. Show all posts
Showing posts with label Kadapa King. Show all posts

17/06/2016

`కడప కింగ్` పవన్ కోసమేనా?

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రానికి హుషారు అనే పేరు పరిశీలనలో ఉందని ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ చిత్రబృందం మాత్రం ఆ ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆ పేరు మా ఆలోచనలోనే లేదని చెప్పుకొచ్చారు. ఎస్.జె.సూర్య తెరకెక్కించే ఆ కథ రీత్యా చూసినా...  ఆ టైటిల్ సరిపడదన్న విషయం ఆ తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. కడప కింగ్ పేరుతో పవన్ చిత్రం తెరకెక్కబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. 

మరి నిజంగా  అలాంటి టైటిల్ తో పవన్ సినిమా చేస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ పేరు వెలుగులోకి రావడానికి కూడా బలమైన కారణమే ఉంది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు - చిత్ర నిర్మాతైన శరత్ మరారే స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి కడప కింగ్ పేరును రిజిస్టర్ చేయించారట. అప్పట్నుంచి పవన్ కొత్త చిత్రం పేరు కడప కింగ్ అని ప్రచారం మొదలైంది.  ఫ్యాక్షనిజంతో ముడిపడి వున్న కథ కాబట్టి ఆ పేరుతోనే తెరకెక్కొచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ చిత్రం కోసం  త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు పవన్ కళ్యాణ్. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. మొదట శ్రుతిహాసన్ని అనుకొన్నా ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో రకుల్ని ఎంపిక చేసుకొన్నారు.