22/09/2016

ఎన్టీఆర్.. చిరు.. మహేష్.. అంటున్న నాని

తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.

ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు. 

టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్-5 లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ఈ లిస్ట్ లో బన్నీ సినిమాకి ప్లేస్ పోయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇందులో వాస్తవం లేదు. 

బాలీవుడ్.. కోలీవుడ్ మాదిరిగా గ్రాస్ కలెక్షన్స్ తో కాకుండా.. తెలుగు సినిమాల లెక్కలన్నీ షేర్ చుట్టూనే సాగుతాయి. డబ్బింగ్ వెర్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లెక్కలు చూస్తూ.. మొదట బాహుబలి (302.3 కోట్లు) ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీమంతుడు (85.2 కోట్లు).. మగధీర (83 కోట్లు).. జనతా గ్యారేజ్ (77.56 కోట్లు).. సరైనోడు (76 కోట్లు)ను వసూలు చేశాయి. అంటే.. బన్నీ సినిమా ఈ లిస్ట్ లో టాప్ 5లో ఉందన్నమాట. ఇక్కడ అత్తారింటికి దారేదికి టాప్5 లో చోటు దక్కలేదు. అంతే కాదు.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో అయితే.. బన్నీ ప్లేస్ ఇంకా మెరుగ్గానే ఉంది. 

ఏపీ-తెలంగాణల వరకు అత్యధిక షేర్ ను సాధించిన లిస్ట్ లో బాహుబలి (113.75 కోట్లు) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సరైనోడు (60.80 కోట్లు) రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక మగధీర (61.60 కోట్లు).. శ్రీమంతుడు(60.17 కోట్లు).. అత్తారింటికి దారేది (58.87 కోట్లు)  టాప్5లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. ఈ లిస్ట్ లో అయితే.. జనతా గ్యారేజ్ (57.46 కోట్లు) టాప్5లో చోటు దక్కలేదు. ఈ లెక్కన టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు కదా.

21/09/2016

కాటమరాయుడితో కొత్తమ్మాయి

మామూలుగా ఓ స్టార్ హీరో సినిమా అంటే.. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని చూస్తారు ఫ్యాన్స్. పవన్ లాస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఎంత జాప్యం జరిగిందో తెలిసిందే. లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ముహూర్తం జరుపుకుని మూడు నెలలు దాటింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ విషయంలో అనుకున్న డేట్లు రెండు మూడు దాటిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల 24 నుంచి సినిమా నిజంగానే సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ గురించి ఓ కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయి కీలక పాత్ర పోషిస్తోందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యామిని పాత్ర ఏంటో చూడాలి. యామిని ఇంతకముందు ‘కీచక’ అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది. అలాగే ‘రభస’లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అనగానే ఉబ్బితబ్బిబ్బయిపోతోంది యామిని. పవన్ తో ఇంతకుముందు ‘గోపాల గోపాల’ తీసిన కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. పవన్ మిత్రుడు శరత్ మరారే నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ దర్శకత్వం వహిస్తాడు

19/09/2016

చిరు సినిమాలో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా పోలీసులకే దొరక్కుండా ఉంటే.. ఇక చిరంజీవి సినిమాలో నటించడమేంటి అంటారా? చిరు సినిమాలో మాల్యా ఉండడు. ఆయనను పోలిన క్యారెక్టర్ ఉంటుందట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను మాల్యా తరహాలో డిజైన్ చేశారట. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే వెల్లడించాడు. తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముకేశ్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.

ఈ పాత్ర గురించి అతను చెబుతూ.. ''తమిళ వెర్షన్‌లోని పాత్రలో బేసిగ్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర గురించి వినాయక్ గారు నాకు వివరించారు. ఆయన చెప్పినపుడు నాకు విజయ్ మాల్యా గుర్తుకొచ్చారు. ఆయన్ని ఉద్దేశించే ఆ పాత్రను రాశారా అనిపించింది'' అని తరుణ్ చెప్పాడు.  

ఇక తెలుగులో తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తుండటం గురించి తరుణ్ చెబుతూ.. ''నాకు ఇంత కంటే గొప్ప అరంగేట్రం ఏముంటుంది? ఇది నా అదృష్టం. ఐతే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలేమీ తీయలేదు. ఒకట్రెండు సీన్స్ తీశారంతే. ఈ లోపు వర్షం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. చిరంజీవి గారితో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చాలా మాట్లాడాలనుంది. తర్వాతి షెడ్యూల్లో ఆయనతో ముచ్చటిస్తా. చిరంజీవి గారితో కలిసి నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నాడు.

18/09/2016

బన్నీ సినిమాలో చిరు గెస్ట్ రోల్?

శాండల్ వుడ్ లో ఉన్న రెబెల్ స్టార్.. పవర్ స్టార్ ల సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. రెబెల్ స్టార్ అంబరీష్.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు కలిసి ఓ సినిమా చేశారు. 'దొడ్డమానే హడ్గ' పేరుతో ఓ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా.. పరిశీలనలో ఉందని టాక్. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. ఇది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఒక వేళ సాధ్యమయితే మాత్రం.. తెలుగు మల్టీ స్టారర్  హిస్టరీలో కొత్త శకం స్టార్ట్ అయినట్లే. 

కాన్సెప్ట్.. ప్రాజెక్ట్ బాగానే ఉన్నా.. రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే.. టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మరి రెబెల్ స్టార్ రోల్ లో మెగాస్టార్.. పవర్ స్టార్ పాత్రలో స్టైలిష్ స్టార్ ని చూసే అవకాశం ఇస్తారో లేదో !

17/09/2016

మోహన్ బాబు చేతులమీదుగా చిరు MB40

విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మోహన్ బాబు 40వసంతాల సినీ జీవిత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సినిమా రంగానికి చెందినవారే కాకుండా - రాజకీయాలకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన అతిరథమహారధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అత్యంత ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఒక పొలిటీషియన్.. ఒక ఎడ్యుకేషనిస్ట్.. అంతకంటే మించి అందరి మంచీ కోరుకునే ఒక మంచి స్నేహితుడు.. ఆయన ఒక గొప్ప వ్యక్తి.. రేపటి తరాలకు ఒక మంచి ఇనిస్పిరేషన్.. అని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక కంఠంతో మోహన్ బాబుని కొనియాడింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు - సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం గురించి ప్రస్థావించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు... తన 40 సంవత్సరాల కేరీర్ సందర్భంగా జరిగిన కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమాన్ని తిరుపతి వేడుకగా తానే చేస్తానని ప్రకటించారు. చిరంజీవి తర్వాత వెంకటేష్ సినీ కెరీర్ కి సంబందించిన సన్మాన కార్యక్రమం కూడా తానే చేస్తానని మోహన్ బాబు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చిరంజీవి - వెంకటేష్ లిద్దరూ చిరునవ్వులు చిందించారు. అనంతరం సభాప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

MB40: చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు

ఇకపోతే ఎంబి40 ఈవెంట్లో చిట్టచివర మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ అంతా ఒకెత్తయితే.. అందులో మోగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రత్యేకం. 

''చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు. నేను కూడా ఆయనకు ఎప్పుడు చెడు చేయలేదు. మేం గ్రేట్ ఫ్రెండ్స్ అంతే.  నేను చిరంజీవితో చేసినన్ని సినిమాలు ఎవ్వరితోనూ చేయలేదు. ఇక చిరంజీవి తన తండ్రిని ఎంతో ప్రేమించేవారు.. అలాంటి ప్రేమ తన పెద్దకూతురుకు వచ్చింది. ఎక్కడ కనిపించినా అంకుల్ అని పిలుస్తుంది. అలాగే నాకు అల్లూ రామలింగయ్య గారంటే చాలా కష్టం. ఆయనంటే నాకు ఎంత ప్రేమో అరవింద్ మథర్ కు తెలుసు. ఇక అరవింద్ కూడా నాకు మంచి స్నేహితుడే. నాకు నాగబాబు అంటూ చాలా ఇష్టం. అది బయటకు తెలియదు. నా పేరు భక్తవత్సలం నాయుడు.. నేను పెద్దకాపును అన్నాను. అన్నా నువ్వా అంటూ నాగబాబు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడకు వచ్చేశాడు. చాలా మంచోడు తను'' అంటూ 'మెగా' పొగడ్తలతో ముంచెత్తారు మోహన్ బాబు.  

''షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్ చిరంజీవి. మళ్లీ అదే కాంబినేషన్ డేట్లు దొరకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. హోల్ హార్డెడ్ థ్యాంక్స్ చిరంజీవి'' అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చిరంజీవి మథర్ కు నమస్కారాలు అంటూ చెప్పిన మోహన్ బాబు.. ''చిరంజీవి మర్చిపోతాడు నువ్వు మర్చిపోవు. అమ్మకు నా నమస్కారాలు. నువ్వు ఆవిడకు తెలియజేయి'' అని సెలవిచ్చారు.

''తదుపరి 40 ఏళ్ల సన్మానం జరిగేది చిరంజీవికే. ఆ సభను నా చేతిలో పెట్టు చిరంజీవి.. నేనే ముందుండి అంతా నడిపిస్తాను. చూడు అప్పుడు. ఆ తరువాత 40 ఏళ్ల పండుగ వెంకటేష్ దే'' అంటూ ముగించారు మోహన్ బాబు.