18/07/2016

బాలయ్య సినిమాని చిరు ప్రమోట్ చేశాడా?!

చిరంజీవి - బాలకృష్ణ సమకాలికులు. ఒకప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ల సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీపడేవి.  మాస్ లో బలమైన అభిమానగణం సంపాదించుకొన్న ఆ ఇద్దరూ ఎవరి శైలిలో వాళ్లు సినిమాలు చేస్తూ పరిశ్రమని కళకళలాడించారు. అయితే ఈ  ఇద్దరి మధ్య ఎంత పోటీ ఉన్నా... అది ఆరోగ్యకరంగానే ఉండేదనడానికి ఇదొక ఉదాహరణ. బాలయ్య నటించిన ఆదిత్య 369 చిత్రం పాతికేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. 

బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమాకి చిరంజీవి ప్రమోషన్ చేశాడు. ఇది ఆశ్చర్యకరంగానే ఉంది కదూ! నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు స్టార్లు ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్  చేయడం నిజంగా విశేషమే. కానీ ఆదిత్య 369 కథని - ఆ సినిమాని నచ్చిన చిరంజీవి పాతికేళ్ల క్రితం దూరదర్శన్ కోసం టీవీ యాడ్స్ చేశాడట. రెండు యాడ్స్ లో నటించి ఆదిత్య 369ని చూడమని చెప్పాడట. ఆయనతోపాటు ఆ సినిమాతో ఏమాత్రం సంబంధం లేని విజయశాంతి కూడా  ప్రమోట్ చేసిందట. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించాడు.  నిజంగా నేటితరం కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే ఎంత మంచి వాతావరణం ఉంటుందో కదూ!

16/07/2016

ది మెగా ఫ్యాన్' ప్రాజెక్టు అంటే..

సోషల్ అవేర్ నెస్ అనే కాన్సెప్ట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి క్లారిటీ ఉంది. ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని మరీ సామాజిక కార్యక్రమాలవైపు అడుగులు వేస్తాడు. ఇప్పుడు తను ఫ్యాన్స్ కోసం చేపట్టబోతున్న ఓ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి డీటైల్డ్ గా డిస్క్రిప్షన్ ఇచ్చాడు రామ్ చరణ్. 

''ది మెగా ఫ్యాన్ అనే  పేరుతో ఓ స్మాల్ ప్రాజెక్ట్ చేస్తాం. ఎవరైనా సరే అభిమానులు తమ సొంత సిటీలోనో.. ఏరియాలోనో..  సొసైటీ కోసం ఓ మంచి పని చేయాలి. ఎనీ గుడ్ వర్క్ చేసి వీడియో తీయండి. అందరూ మంచి పనులే చేయాలని చెప్పడమే దీని ఉద్దేశ్యం. వాటర్ ప్రాబ్లెమ్ కావచ్చు.. స్వచ్ఛ్ భారత్ లాంటిది కావచ్చు.. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా గుడ్ యాక్టివిటీ చేపట్టి.. దాన్ని నా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయండి. వాటిలో బెస్ట్ అనిపించేవి కొన్ని సెలక్ట్ చేసి.. ఆ వ్యక్తులను డాడ్ 150 సినిమా సెట్స్ కి తీసుకెళ్తాం. అక్కడ షూటింగ్ చూసే అవకాశంతో పాటు.. అందరితోనూ కలిసే అవకాశం కూడా కల్పిస్తాం'' అంటూ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. 

ఇతర విషయాలకు వస్తే.. చరణ్ ప్రస్తుతం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు.. ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నాడు. ''నేను అంత సోషల్ గై కాదు.. ఫేస్ బుక్ నే అభిమానులతో టచ్ లో ఉండేందుకు మెయింటెయిన్ చేస్తున్నా.. వీలైతే మిగతావి కూడా త్వరలో ట్రై చేస్తా'' అంటూ సోషల్ మీడియా గురించిన తన ఒపీనియన్ చెప్పాడు చెర్రీ. 

15/07/2016

చెర్రీ చేసేవి.. చేయాలని అనుకునేవి..

రామ్ చరణ్ ధృవ మూవీ హై రేంజ్ స్పీడ్ లో ఫినిష్ అయిపోతోంది. ఆగస్ట్ 15న ఫస్ట్ లుక్.. అక్టోబర్ లో సినిమా రిలీజ్ ఖాయమంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పేశాడు. మరి చెర్రీ చేయనున్న నెక్ట్స్ మూవీ ఏంటి? ఇదే ప్రశ్న చరణ్ ని నేరుగా ఫేస్ బుక్ లైవ్ లో ఓ అభిమాని అడిగాడు. 

''నా నెక్ట్స్ సినిమా సుకుమార్ గారితో ఉంటుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కన్ఫాం అయింది. దీన్ని అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్. ఇక చేయాలని అనుకుంటున్న సినిమాలపై కూడా చాలానే సవాళ్లు చెర్రీకి ఎదురయ్యాయి. ''గౌతమ్ మీనన్ సినిమాలు నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఆల్మోస్ట్ ప్రతీ మూవీ చూస్తాను. త్వరలో ఆయనతో ఓ మూవీ చేస్తానని అనుకుంటున్నా'' అని ఫ్యాన్ కి జవాబిచ్చిన చరణ్.. మురుగదాస్ తో కూడా ఏదో ఒక రోజు పని చేయడం ఖాయమని చెప్పడం విశేషం. ఇక డెబ్యూ డైరెక్టర్లతో సినిమా అంటే చాలా ఉత్సాహమని.. తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. 

వీటన్నిటికంటే చెర్రీకి ఎదురైన టఫ్ క్వశ్చన్ ఏంటంటే.. బాలీవుడ్ లో మళ్లీ ట్రై చేస్తారా అనే. జంజీర్ తో ఓ సారి దెబ్బ తిన్నాడు కాబట్టి.. దీనికి నో అనే ఆన్సర్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారంతా. కానీ ''బాలీవుడ్ లో మళ్లీ ప్రాజెక్ట్.. మంచి సబ్జెక్ట్ దొరకాలే కానీ ఎక్కడైనా చేస్తా.. అది తమిళ్ కావచ్చు.. బాలీవుడ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ఏ మూవీ చేసేందుకైనా నేను రెడీ'' అంటూ తన బాలీవుడ్ ఫ్యూచర్ పై ఓ స్పష్టత ఇచ్చాడు మెగా పవర్ స్టార్. 

మెగా' ఫ్యామిలీ చాలా మంచిదన్న కోడలు

ఉపాసన.. మెగా తనయుడు రామ్ చరణ్ కు భార్య అయ్యాక ఈమె చాలామందికి దగ్గరైపోయింది. మెగా కుటుంబానికి కోడలుగా వెళ్లక ముందే ఈమె వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. అయితే.. తన గురించి తాను చెప్పుకోవాలంటే.. ఇవి మాత్రమే కాదని - బిలియన్ డాలర్ వాణిజ్య సామ్రాజ్యాన్ని సృష్టించాలని తపన పడే వ్యక్తిగా అభివర్ణించుకుంటుంది ఉపాసన. 

మెగాస్టార్ కి కోడలిగా వెళ్తుందని తెలిసినప్పటి నుంచి తన చుట్టూ ప్రపంచం మారిపోయిందని ఉపాసన చెబుతోంది. అభినందించిన వారితో పాటు విమర్శలు కూడా వచ్చాయన్న ఆమె.. తన చుట్టూ వస్తున్న వార్తల కారణంగా మరింత అలర్ట్ గా మారానని తెలిపింది. 'నేను కలిసిన మంచి వ్యక్తుల్లో అత్యుత్తమం అంటే నా అత్తారింట్లో మనుషులే. కేవలం కుటుంబంలోనే కాదు.. రామ్ చుట్టూ ఉండే ప్రతీ ఒక్కరు నా గురించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఇంట్లో కుక్ దగ్గర నుంచి సెట్స్ లో డైరెక్టర్ వరకు అందరు సహాయం చేసే వ్యక్తులే. చరణ్.. తన కుటుంబం ఇంత సపోర్ట్ లేకుండా ఉండే ఇలా ఉండేదాన్ని కాదేమో' అని చెప్పింది చిరుత లైఫ్ పార్ట్నర్. 

తన లుక్స్ పై కూడా స్పందించిన ఉపాసన.. వ్యక్తిగతంగా తాను చిన్నప్పటి నుంచి బాగా లావుగా ఉండి ఇబ్బంది పడేదాన్నని చెప్పింది. అయితే.. తన తండ్రి.. ఆ తర్వాత భర్త ఎంతో మద్దతుగా నిలిచి ఇప్పుడు తననిలా మార్చేశారని అంటోంది. 'ఎంత ఫిట్ గా ఉంటే అంత కాన్ఫిడెన్స్ కళ్లలో కనిపిస్తుందని నా భర్త చెప్పారు.. నేను అదే ఫాలో అయిపోతున్నా' అంటోంది ఉపాసన. 

07/07/2016

మెగా హీరో సినిమాలో బన్నీ కేమియో

ఇద్దరు మెగా హీరోలకు ఆఫ్ స్క్రీన్ లో తప్ప.. ఆన్ స్క్రీన్ లో ఒకే సారి చూసే అవకాశం అంత తేలిగ్గా రాదు. అందరూ ఒకటే అయినా ఎవరికి వారే సినిమాలు చేసేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇమేజ్ కి తగ్గట్లుగా వాళ్లు సినిమాలు చేస్తుంటారు. అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ లో అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోలంతా కనిపించారు. ఆ తర్వాత ఎవడు మూవీలో చెర్రీ-బన్నీ ఇద్దరూ చేశారు కానీ.. ఒకే ఫ్రేమ్ లో మాత్రం కనిపించరు. ఇప్పుడో మూవీలో బన్నీ కేమియో చేస్తున్నాడనే వార్తలతో.. ఇద్దరు హీరోలకు ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.

అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ శ్రీరస్తు..శుభమస్తు. ఈ సినిమాలో బన్నీ ప్రచారం చేయడంతో పాటు.. శిరీష్ నెక్ట్స్ మూవీలో ఓ స్పెషల్ కేమియో చేయనున్నాడనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికి రెండు సినిమాలు చేసినా సరైన గుర్తింపు సంపాదించలేకపోయాడు శిరీష్. గౌరవం మూవీతో ఫ్లాప్ ని.. కొత్త జంటతో యావరేజ్ ని అందుకున్న శిరీష్.. శ్రీరస్తు శుభమస్తుపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని హిట్ ట్రాక్ పట్టించే బాధ్యతను ఇప్పుడు అల్లు అర్జున్ టేకప్ చేశాడని తెలుస్తోంది. తమ్ముడికి ఓ విజయం అందించేందుకు తన వంతుగా సాయం చేస్తున్నాడు బన్నీ. 

వచ్చే నెలలో శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ కానుండగా.. శిరీష్ తర్వాత సినిమా మల్లాది వేణు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించనుండగా.. అల్లు శిరీష్ - అల్లు అర్జున్ కలిసి కనిపించే సన్నివేశాలు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటాయట. తమ్ముడి కోసం అన్న బాధ్యతలు టేకప్ చేయడాన్ని ఫిలింనగర్ లో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. 

మళ్లీ పాలసీని బ్రేక్ చేస్తున్న బన్నీ

తన కెరియర్ లో కేవలం మాజీ వైఫ్ రేణు దేశాయ్ తో మాత్రమే రెండోసారి నటించాడు పవన్ కళ్యాణ్. ఇన్నేళ్ళ కెరియర్ లో ఏ హీరోయిన్ ను కూడా ఆయన రెండోసారి రిపీట్ చేయలేదు. ఇక అదే పద్దతిలో దంచేస్తున్నాడు మరో మెగా హీరో అల్లు అర్జున్. కాని మొన్ననే బోయపాటి శ్రీను ఫోర్సు చేయడం కారణంగానే సరైనోడు సినిమాలో క్యాథరీన్ త్రెసాను తీసుకున్నాడట. అప్పటికే రుద్రమదేవి లో ఓసారి ఆమెతో కలసి నటించేశాడు కూడా. అయితే క్యాథరీన్ కోసమే బ్రేక్ చేసిన ఈ నో-రిపీట్ పాలసీని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు. 

ఇప్పటికే తనతో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతి హాసన్ తో రెండోసారి పనిచేద్దాం అని ఫిక్సయిన పవన్.. ఆమెను ఎస్.జె.సూర్య సినిమాలోకి హీరోయిన్ గా తీసుకున్నాడు. మరి డైరక్టర్ ను మార్చాడు కాబట్టి హీరోయిన్ ను కూడా మారుస్తాడేమో తెలియదు కాని.. ఇదంతా చూసి బన్నీ కూడా ఇన్ స్పయిర్ అయినట్లు అనిపిస్తోంది. రేసుగుర్రం సినిమాలో తనతో హిట్ జోడీగా నటించిన శృతి హాసన్ తో రెండోసారి పని చేద్దాం అని ఫిక్సయ్యాడటలే. త్వరలో హరీశ్ శంకర్ డైరక్షన్ లో చేయబోయే సినిమా కోసం.. శృతిని శృతిచేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే శృతి హాసన్.. హరీశ్ శంకర్ తో గబ్బర్ సింగ్ - బన్నీతో రేసుగుర్రం వంటి సాలిడ్ హిట్లు కొట్టింది కాబట్టి.. ఇప్పుడు తన పాలసీని బ్రేక్ చేస్తున్న తరుణంలో ఈ మెగా హీరోకు మరింత పెద్ద హిట్టిస్తుంది అని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అది సంగతి. 

అవార్డుతో పాటు చిరంజీవి ఛాన్స్ కూడా

మొన్ననే సిని'మా' అవార్డుల కార్యక్రమంలో కొరయోగ్రాఫర్ జానీ మాష్టర్ కు ''ఉత్తమ కొరియోగ్రాఫర్'' అంటూ టెంపర్ సినిమాలోని టైటిల్ స్టెప్పుకు గాను అవార్డు వచ్చేసింది. అయితే అదొక్కటే కాదండోయ్.. ఇప్పుడు జానీకి మరో మెగా ఛాన్సు కూడా వచ్చింది. 

ఎప్పటికీ కూడా చిరంజీవి ఫేవరేట్ కొరియోగ్రాఫర్లు ఎవరంటే.. ప్రభుదేవా అండ్ లారెన్స్ అనే చెప్పాలి. ఆ ఇద్దరినీ పెద్ద పెద్ద డ్యాన్సు మాష్టర్లుగా మార్చింది మాత్రం మెగాస్టారే. ఆ తరువాత వారు అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరూ తమకు నచ్చిన డ్యాన్సర్ అంటే ముందు చిరు పేరునే చెబుతారు. ఇక చిరంజీవి 150వ సినిమా అంటే.. ఖచ్చితంగా ఆ ఇద్దరూ పాటలు కంపోజ్ చేస్తారని ఎవరైనా ఇట్టే చెప్పేయొచ్చు. అయితే వాళ్ళతో కలసి ఇప్పుడు ఒక సాంగ్ కు కంపోజ్ చేసే ఛాన్సు జానీ కొట్టేశాడట.

ఇప్పటికే మనోడు నేను రామ్ చరణ్ కారణంగానే ఈ పొజిషన్లో ఉన్నానంటూ ఓపెన్ గా చెప్పడం.. పైగా ప్రతీసారీ చరణ్ కు చాలా కొత్త కొత్త స్టెప్పులు కంపోజ్ చేయడంతో.. మెగా ఫ్యామిలీకి బాగానే దగ్గరయ్యాడు. అవన్నీ కలిసొచ్చి ఇప్పుడు ఇలా #మెగా150 లో కొరియోగ్రాఫీ ఛాన్సొచ్చింది. మొన్న చిరంజీవి సమక్షంలో సిని'మా' అవార్డును తీసుకోవడమే కాదు.. ఇప్పుడు సైమా వేడుకల్లో చిరు దగ్గర నుండి స్వీట్న్యూస్ కూడా అందుకున్నాడు.