Showing posts with label Ram Gopal Varma. Show all posts
Showing posts with label Ram Gopal Varma. Show all posts

12/09/2016

పవన్ ని చూసి వర్మ కుళ్లుకుంటున్నాడట

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిన్నటి నుంచి ఓ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. పవన్ మంచి సింగరా.. తను మంచి గాయకుడా అన్నదే దీని ఉద్దేశ్యం. తానే బాగా పాడతానని కావాలంటే సాక్ష్యం ఇదుగో అని.. వంగవీటిలో తను పాడిన పాటని పోస్ట్ చేసి.. కాకినాడ సభలో పవన్ పాటను పోల్చుకోమని జనాలకు చెప్పాడు. చివరకు దీనిపై ట్విట్టర్ సాక్షిగా ఓటింగ్ కూడా పెట్టేశాడు. 

ఈ ఓటింగ్ లో మొత్తం 13609మంది పాల్గొంటే.. 54శాతం పవన్ కి.. 46 శాతం వర్మకి ఓటేశారు. అయితే.. తాను కేవలం 8శాతం తేడాతో ఓడిపోయానని చెప్పిన వర్మ.. ఈ పోలింగ్ లో ఇంత తక్కువ మంది పాల్గొనడంతో.. పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. 'మా అమ్మ.. సోదరుడు.. అమ్మమ్మ.. ఆంటీ కూతురు.. చుట్టుపక్కలవాళ్లు అందరూ పవన్ కళ్యాణ్ సింగింగ్ కే ఓటేశారు. నాకు విపరీతమైన కుళ్లుగా ఉంది' అంటూ ట్వీట్ చేస్తూనే.. పవన్ కళ్యాణ్ అభిమానులను నిరక్షరాస్యులు అనేశాడు

'ఇంత తక్కువ మంది ఓటేశారంటే.. కచ్చితంగా ఫ్యాన్స్ నిరక్షరాస్యులే.. ఇలాంటి వాళ్లకంటే కాస్త చదువుకున్న తెలివైన ఫ్యాన్స్ ని పవన్ కాన్సంట్రేట్ చేస్తే బెటర్' అంటూ పవన్ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఒకవైపు ఓడిపోయానని ఒప్పుకుంటూనే.. అందుకు కారణం పవన్ ఫ్యాన్స్ పైనే తోసేశాడు వర్మ. 

11/09/2016

పవన్ గురించి వర్మ తాజా మాట విన్నారా?

ఆసక్తికర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరిస్తుంటారు విలక్షణ దర్శకులు రాంగోపాల్ వర్మ. విషయం ఏదైనా తన మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అస్సలు ఆలోచించని తత్వం వర్మకు మాత్రమే సొంతం. ఎంత వివాదాస్పదమైన అంశాన్నైనా ఓపెన్ గా మాట్లాడే ఆయన కొన్నిసార్లు ఎంతగా పొగిడేస్తారో.. మరికొన్నిసార్లు అంతే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతారు.

కాకినాడ సభలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిన పాట కంటే వంగవీటి సినిమాలో తాను పాడిన పాటే బాగుందంటూ చురకలు అంటించేలా ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన వర్మ.. మరోవైపు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా వెనకేసుకురావటం గమనార్హం. పవన్ ను ఏ ఒక్కరూ తక్కువగా అంచనా వేయొద్దన్న ఆయన.. పవన్ ను చిన్నచూపు చూసినోళ్లంతా చెత్త ఆలోచన ఉన్నోళ్లేనంటూ ఆరోపించారు.

కాకినాడ సభలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడిపై పవన్ కల్యాణ్ భారీ ఎత్తున దాడికి దిగటం.. ఈ వ్యవహారాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకొని.. ముప్పేట విమర్శల దాడికి చేసేలా వ్యూహం సిద్ధం చేయటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పలువురు పవన్ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్న వేళ.. వర్మ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయి.. ఏపీ.. తెలంగాణలోని పరిస్థితుల్లో పవన్ కున్న అవగాహన.. ఆయనకున్న ఫ్యాన్స్ ను గమనిస్తే.. పవన్ కమాండర్లకే కమాండర్ అవుతారన్నారు. ఏపీలో అతి పెద్ద కమాండ్ గా అవుతారన్న వర్మ.. పవన్ గురించి డర్టీ మైండ్ ఉన్నోళ్లే తప్పుగా ఆలోచిస్తారని అమితమైన అభిమానాన్ని ప్రదర్శించటం గమనార్హం.

04/09/2016

పవన్‌ ఉండటం ఏపీ ప్రజల అదృష్టం..: వర్మ

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకునే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ప్రకటన చేశాడు. పవన్ కళ్యాణ్‌ను పలుసార్లు విమర్శించిన వర్మ తాజగా తన స్పందనతో ఆకాశానికెత్తేశాడు. మాట్లాడలేని వాళ్లే పవన్‌ను అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని చెప్పాడు. తన అత్యంత తెలివైన ఉద్యమ ప్లాన్‌ను వాళ్లు అర్ధం చేసుకోలేరని విమర్శించాడు. ఇప్పుడే తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని విన్నానని చెప్పిన వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పవన్ తాను ఏం మాట్లాడుతున్నాడో బాగా అర్ధం చేసుకునే ప్రసంగించాడని, ప్రత్యేక హోదా కోసం పవన్ ప్రకటించిన మూడంచెల సమరం చాలా సరైనదని అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్‌ను కలిగి ఉండటంతో ఏపీ ప్రజలు అదృష్టవంతులని తేల్చి చెప్పాడు. పవన్ కళ్యాణ్ అంత నిజాయితీ కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఒక్కరు కూడా లేరని చెప్పాడు వర్మ. అతని నిజాయితీనే అతని బలమని, అతని వ్యక్తిత్వమే అతని స్టార్ స్టేటస్ అని వివరించాడు రామ్ గోపాల్ వర్మ.


22/08/2016

RGV apologises to Mega fans

Maverick director Ram Gopal Varma is known for his aggressive comments and mindless criticism many a times. Especially when it comes to Mega family films and issues, he makes a mere mockery.

Last night however RGV has surprised one and all by tweeting very postively about Megastar Chiranjeevi's 150th film. "Best look of MegaStar in his entire Career.Super classy-Super Intense With this pic Khaidi No.150 title ROCCCCKS! Mega Star's Look is Amazingly Mindblowing...Looks Like A Sure Shot Block Buster..Million Cheers" he tweeted. 

Not stopping there, he has made another tweet, which really made minds blowing. "After seeing this look i want to apologise to all his fans  for whatever criticism I made in the past on his 150th", said RGV, apologising. That's something very new.