Showing posts with label Meelo Evaru Koteswarudu. Show all posts
Showing posts with label Meelo Evaru Koteswarudu. Show all posts

10/09/2016

అది వర్కవుటైతే 150 కలక్షన్లు పేల్తాయ్

చాలా రోజుల నుండి ఇదిగో కమ్ బ్యాక్ అదిగో కమ్ బ్యాక్ అంటూ నాన్చుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మొత్తానికి 2016లో 'కత్తి' సినిమా రీమేక్ ''ఖైదీ నెం 150''తో ఇక తన మెగా రీ-ఎంట్రీకి నాంది పలికారు. అయితే 9 ఏళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ ఒక ఫుల్ ప్లెడ్జడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి సాధారణంగా హైప్ బాగానే ఉంటుంది. కాకపోతే యూత్ కు కనక్ట్ అవ్వకపోతే ఏంటి సంగతి? అనే ఒక చిన్న సందేహం కూడా ఉండనే ఉంది. 

నిజానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ - డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ.. 2007లో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ (హీరోగా ఆయన గత సినిమా) రిలీజ్ అయ్యేనాటికి ఐదు ఆరు తరగతుల్లో ఉండుంటారు. వారు ఇప్పుడు మెగాస్టార్ కు కనక్ట్ అవ్వడం అంటే మాత్రం కాస్త గట్టిగా చూడాల్సిన విషయమే. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ తో వస్తున్నారు. డిసెంబర్ లో ఈ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అవుతుంది. 6వ తరగతి చదివే వారి నుండి.. కాలేజీ పిల్లల వరకు.. బిజినెస్ పీపుల్ నుండి.. ఇంట్లో ఉండే పెద్దలు వరకు.. అందరూ ఈ ప్రోగ్రామ్ పై మాంచి ఆసక్తి కనబరచిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి హోస్ట్ అనేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వారందరూ మెగాస్టార్ కు కనక్టైపోతారు. అప్పుడు ఖచ్చితంగా ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతం మ్యాసివ్ గా పెరుగుతుంది. ఇంకేముంది.. ''ఖైదీ నెం 150'' కలక్షన్లు పేలతాయ్. 

ఆ విధంగా చిరంజీవి ఇప్పటికే హైప్ తెచ్చేసిన ఖైదీ నెం 150 కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేస్తారనమాట. చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ ను చిరంజీవి కొత్త రేంజుకు తీసుకెళ్లడం ఏమో కాని.. ఆ ప్రోగ్రామ్ చిరు రీ-ఎంట్రీ మూవీని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడేలా ఉంది కదూ. రెండింటికీ లాభదాయకం అనమాట. 

09/09/2016

చిరంజీవి మరో స్థాయికి తీసుకెళ్తాడు-నాగ్

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయి. ఇంతకుముందెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్ సాధించింది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అంత పెద్ద సక్సెస్ కావడంలో నాగార్జునది కీలక పాత్ర. ఐతే మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగ్.. అనూహ్యంగా నాలుగో సీజన్ కు దూరమైపోయాడు. ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. ఐతే ఇది ప్రోగ్రాం మేలు కోసం తీసుకున్న నిర్ణయమే అని.. చిరంజీవి ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేశాడు నాగ్.

‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అది నా జీవితంలో ఓ కీలక మలుపు. ఇన్నేళ్లలో సినిమాల ద్వారా ఎంత ఆదరణ సంపాదించుకున్నానో.. అంత ఆదరణ ఈ ప్రోగ్రాంతో దక్కింది. ఐతే సమయానికి తగ్గట్లు మనం ముందుకు వెళ్లిపోవాలి. షో సూపర్ సక్సెస్ అయినపుడే నిష్క్రమించడం మంచిదే. చిరంజీవి గారు నా స్థానంలోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారు’’ అని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం సినిమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని.. తన కొడుకులిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించనుండటంతో తనపై బాధ్యత పెరిగిందని నాగ్ అన్నాడు. కొడుకులిద్దరికీ సొంత బేనర్లో మంచి సినిమాలు అందిస్తానని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వాళ్లిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించబోతున్నానని.. అవి కచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాయని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

08/09/2016

కామెంట్: అసలు 'మెగా' ఎంట్రీ ఎందుకంటే

ఇప్పుడు అందరూ ఆసక్తిగా డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే.. కింగ్ నాగార్జున స్థానంలో అసలు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' షోకు హోస్టుగా వస్తున్నారనే పాయింటే. అయితే ఇందులో స్టార్ మేనేజ్మెంట్ తాలూకు హస్తం ఉందని తెలుస్తోంది. కేవలం ఇదొక క్రియేటివ్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెసిషన్ క్రిందే చూడమంటున్నారు విశ్లేషకులు. 

కౌన్ బనేగా కరోడ్ పతి అనే ప్రోగ్రామ్ అసలు హిందీలో హిట్టయినట్లు ఇతర భాషల్లో క్లిక్కవ్వలేదు. కాని తెలుగులో మాత్రం ఇరగదీసింది. దానికి కారణంగా నాగార్జున హోస్ట్ చేయడమే. ఇప్పటికే ఆయన సక్సెస్ఫుల్ గా మూడు సీజన్లను హోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మాటివిని హస్తగతం చేసుకున్న స్టార్ మేనేజ్మెంట్ వారు.. ఈసారి 4వ సీజన్ కు మరింత ఆసక్తిని పెంచాలనే భావనతో.. హోస్టును మార్చుదామా అనే దిశలో ఆలోచించడం.. అలాగే నాగార్జున కూడా కొన్నాళ్లపాటు ఈ షో నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకోవడంతో.. కొత్త హోస్టు కోసం వెతకడం జరిగింది. ఆ టైములో నాగార్జున స్వయంగా మెగాస్టార్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మెగాస్టార్ కూడా ఈ షో పట్ల తాను ఎంతో ఎట్రాక్ట్ అయిపోయానని ఒక ఎపిసోడ్ లో గెస్టుగా వచ్చి నాగార్జునకు వివరించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన కూడా అడిగిన వెంటనే నో అనలేకపోయారు. పైగా ఈ ప్రోగ్రామ్ చేయడం వలన ఒక ప్లస్ ఏంటంటే.. ఈ హాట్ సీట్లో కూర్చుంటే దాదాపు ప్రతీ ఇంట్లోవారికి క్లోజ్ అయిపోవచ్చు. తద్వారా ఆడియన్స్ కూడా సదరు హీరోల సినిమాలను ఎక్కువగా చూసే ఛాన్సుంది. ఈ ప్రోగ్రామ్ చేసిన తరువాత నాగ్ తీసిన ''సోగ్గాడే చిన్నినాయన'' కలక్షన్లు అద్భుతంగా పెరగడం మనం గమనించాం. బహుశా ఇప్పుడు చిరంజీవి కూడా అదే దిశలో ఆలోచించి.. ఈ విధంగా 'మెగా' ఎంట్రీ ఇస్తున్నారనమాట. 

07/09/2016

డిసెంబర్ 12 నుంచి మెగాస్టార్ వస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని తూకం వేయడం అంచనా వేయడం సాధ్యం కాదు. వెండితర రారాజుగా వెలిగిపోయిన ఆయన.. గత 9 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటూ.. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 అంటూ రాబోతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. దీని కంటే ముందు మరో పెద్ద సంచలనం నమోదు కానుంది. 

మెగాస్టార్ బుల్లితెరపైకి కూడా వచ్చేయనున్నారట. ఓ గేమ్ షోకు హోస్ట్ గా ఆన వ్యవహరించనుండగా.. ఈ కార్యక్రమానికి ఇప్పటికే కోట్లకొద్దీ అభిమానులున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నాలుగో సీజన్ కి మెగాస్టార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.  మాటీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమం. ఇప్పటికే 3 సీజన్ల పాటు సాగింది. అనుకన్న స్థాయి కంటే చాలా ఎక్కుగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. 

గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం సూపర్ హిట్ కాగా.. ఈ సారి మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు మాటీవీ ఏర్పాట్లు చేసుకుంటోంది. డిసెంబర్ 12 నుంచి మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానుంది. ఖైదీ నెంబర్ 150 కంటే ముందే.. మెగాస్టార్ సంబరాలు ప్రారంభమైపోవుతాయన్న మాట.