Showing posts with label Akkineni Nagarjuna. Show all posts
Showing posts with label Akkineni Nagarjuna. Show all posts

09/09/2016

చిరంజీవి మరో స్థాయికి తీసుకెళ్తాడు-నాగ్

మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయి. ఇంతకుముందెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్ సాధించింది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అంత పెద్ద సక్సెస్ కావడంలో నాగార్జునది కీలక పాత్ర. ఐతే మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగ్.. అనూహ్యంగా నాలుగో సీజన్ కు దూరమైపోయాడు. ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. ఐతే ఇది ప్రోగ్రాం మేలు కోసం తీసుకున్న నిర్ణయమే అని.. చిరంజీవి ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాడని ధీమా వ్యక్తం చేశాడు నాగ్.

‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అది నా జీవితంలో ఓ కీలక మలుపు. ఇన్నేళ్లలో సినిమాల ద్వారా ఎంత ఆదరణ సంపాదించుకున్నానో.. అంత ఆదరణ ఈ ప్రోగ్రాంతో దక్కింది. ఐతే సమయానికి తగ్గట్లు మనం ముందుకు వెళ్లిపోవాలి. షో సూపర్ సక్సెస్ అయినపుడే నిష్క్రమించడం మంచిదే. చిరంజీవి గారు నా స్థానంలోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారు’’ అని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం సినిమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని.. తన కొడుకులిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించనుండటంతో తనపై బాధ్యత పెరిగిందని నాగ్ అన్నాడు. కొడుకులిద్దరికీ సొంత బేనర్లో మంచి సినిమాలు అందిస్తానని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వాళ్లిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించబోతున్నానని.. అవి కచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాయని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

07/09/2016

చిరు-నాగ్-సచిన్ లుంగీ లుక్..

సినిమా రంగానికి చెందిన ప్రముఖులు స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెట్టడం ఐపీఎల్ నుంచి బాగానే ఊపందుకుంది. ఆ తర్వతా ప్రొకబడ్డి లీగ్ తో చాలామంది రంగంలోకి దిగిపోయారు. తాము మాత్రం ఏం తక్కువ అనుకున్న మన టాలీవుడ్ జనాలు.. ఇండియన్ సూపర్ లీగ్ పేరుతో జరిగే ఐఎస్ ఎల్ లో వాటాలు కొనేసిన సంగతి తెలిసిందే.

కేరళ బ్లాస్టర్స్ జట్టుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు.. మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున.. నిమ్మగడ్డ.. అల్లు అరవింద్ లు కూడా  సహ యజమానులు. ఇప్పుడీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్.. మూడో సీజన్ కు రెడీ అయిపోతున్న సందర్భంగా.. టీమ్ ను అనౌన్స్ చేసేందుకు అందరూ ప్లేయర్లతో పాటు యజమానులు కూడా ఒక చోటకు చేరారు. సచిన్ తో పాటు చిరంజీవి.. నాగార్జున.. అల్లు.. నిమ్మగడ్డలు తెల్ల లుంగీలు.. పసుపు రంగు టీషర్టుల్లో కొత్త లుక్ తో కనిపించారు. ఈ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా.. హీరో నివిన్ పౌలీ. అదేనండీ.. చైతు ప్రేమమ్ ని రీమేక్ చేస్తున్నాడు కదా. ఒరిజినల్ ప్రేమమ్ లో హీరో ఈ కుర్రాడు. 

మన టాలీవుడ్ ప్రతినిధులంతా కాస్త సైలెంట్ గానే ఉన్నారు కానీ.. అసలే ఆటగాడు.. అందులోనూ ఫుట్ బాల్ పై ఎనలేని మక్కువ ఉన్న సచిన్ మాత్రం ఈ టీమ్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కానీ టాలీవుడ్ కి మాత్రం మన టాలీవుడ్ జనాల లుంగీ లుక్ డిఫరెంట్ గా భలే నచ్చేసింది.