Showing posts with label Chandra Babu Naidu. Show all posts
Showing posts with label Chandra Babu Naidu. Show all posts

09/09/2016

పవన్ సభపై చంద్రబాబు స్పందన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన "సీమాంధ్ర ఆత్మాభిమాన సభ" ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీ కమిటీ హాలులో తెదేపా శాసనసభాపక్షం సమావేశంలో ఉన్న చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ప్రసంగం పూర్తయిన అనంతరం స్పందించారు. ఏ కాకినాడలో బీజేపీ సభ పెట్టి రాష్ట్రవిభజనకు పాల్పడి - నేడు ద్రోహం చేసిందో.. అక్కడే సభ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి ఏర్పాటుచేసిన ఈ సభలో.. బీజేపీ పై పవన్ చేసిన విమర్శలపై బాబు స్పందిస్తూ... "పవన్ చేసిన వాదనను మనం అర్ధం చేసుకోవచ్చు" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజిని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం ఏమాత్రం సబబు కాదని బాబు అన్నారు.

కాగా.. ఈ సభ కేవలం బీజేపీని - వెంకయ్యను తిట్టడానికే బీజేపీ వ్యతిరేకులు ఏర్పాటు చేసినదిగా భావిస్తున్నామని చెబుతున్నారు కొందరు బీజేపీ నేతలు. పవన్ కల్యాణ్ సభ అనంతరం జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఇచ్చిన ప్యాకేజీని పాచి లడ్డూలతో పోల్చడం సరికాదని అంటున్నారు. పవన్ మాటలు వింటుంటే.. ఎవరో స్పాన్సర్ చేసి బీజేపీని తిట్టించినట్లుగా ఉన్నాయని ఆయనేదో ఒక హిడెన్ అజెండాతో ఈ సభ పెట్టి బీజేపీని బద్నాం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.