Showing posts with label Boyapati Sreenu. Show all posts
Showing posts with label Boyapati Sreenu. Show all posts

05/09/2016

పవన్-బోయపాటి.. కుదురుతుందా?

బోయపాటి సినిమాలంటే ఒక టైపు. పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీళ్లిద్దరికీ లంకె కుదురుతుందని ఎవ్వరూ అనుకోరు. ఐతే దర్శక రత్న దాసరి నారాయణ రావు మాత్రం వాళ్లిద్దరినీ ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నాడట. దాసరి నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేయడానికి  పవన్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ ఇప్పటిదాక ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీని కంటే ముందు పవన్ చేయాల్సిన సినిమాలే ఎటూ తేలకుండా ఉన్నాయి. ఓ దశలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారు కానీ.. మొన్న పవన్ పుట్టిన రోజుకు దాసరి యాడ్ ఇచ్చి.. ‘తారకప్రభు ఫిలిమ్స్’ ప్రొడక్షన్ నెంబ.38గా పవన్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే దీనికి దర్శకుడెవరన్నదే తేలకుండా ఉంది.

ఓ దశలో డాలీని అనుకున్నారు కానీ.. అతను ‘కాటమరాయుడు’ చేస్తున్నాడు. మళ్లీ అతడితోనే పవన్ చేసే అవకాశాలు లేవు. త్రివిక్రమ్ తో అనుకున్నారు కానీ.. అతను హారిక హాసిని క్రియేషన్స్ లో పవన్ తోనే సినిమా చేయబోతున్నాడు. మరే పెద్ద దర్శకుడూ ఖాళీగా లేడు. ఐతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న బోయపాటిని.. తర్వాతి సినిమా పవన్ తో చేయమని అడుగుతున్నారట దాసరి. బోయపాటి కూడా సుముఖంగానే ఉన్నాడు కానీ.. పవన్ అతడిత సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అన్నదే డౌటు. ఎందుకంటే పవన్ బోయపాటి స్టయిల్లో ఊర మాస్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఆ స్టయిల్ పవన్ కు నప్పుతుందా అనేది డౌట్.  పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నదానిపై ఈ కాంబినేషన్ ఆధార పడి ఉంది.

పవన్ -దాసరి సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా

పవన్ కళ్యాణ్ దాసరి నారాయణరావు కు ఓ సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతోంది తప్ప ముందుకు సాగడం లేదు అని అనుకుంటున్న సమయంలో ఏకంగా ఆ చిత్రానికి దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు తాజాగా సమాచారం అందుతోంది . ఇంతకీ ఆ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా .................. బోయపాటి శ్రీను . అవును మాస్ చిత్రాలకు ,యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయనున్నాడట . దాసరి నారాయణరావు నిర్మించనున్న ఈ చిత్రం ఇప్పట్లో అయితే ప్రారంభం కాదు ఎందుకంటే ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు పవన్ దాని తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా దాని తర్వాతే పవన్ బోయపాటి - దాసరిల చిత్రం చేయనున్నాడు

27/06/2016

బోయపాటికి చిరు బంపరాఫర్ ఇచ్చారా?

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాని స్టార్ట్ చేసేశారు. 9 ఏళ్ల తర్వాత మరోసారి పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కత్తిలాంటోడు సినిమాని రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఆయన.. స్వీడ్ గా సినిమాని సిద్ధం చేయబోతున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన చిరు.. తాను 150వ మూవీతో ఆగిపోవాలని కోరుకోవడం లేదని తేల్చేసిన చిరు.. 151 కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మాస్ సినిమాలు తీయడంలో టాలీవుడ్ టాప్ అనిపించుకున్న బోయపాటి.. చిరంజీవితో సినిమా తీసేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ఎలక్షన్స్ - రాజకీయాలతో అప్పట్లో బిజీగా ఉన్న మెగాస్టార్.. బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేశారు. 150వ సినిమాలు పెదలు పెట్టేశారు. ఈ సయమంలో మెగాస్టార్ నుంచి బోయపాటికి పిలుపు రావడం ఆశ్చర్యం కలిగించింది. 

రీసెంట్ గా బన్నీతో సరైనోడు అంటూ ఊరమాస్ సినిమా తీసి.. ఆడియన్స్ ని మెప్పించాడు బోయపాటి. ఈ దర్శకుడి టేకింగ్ - మాస్ ని మెప్పించిన తీరు చిరుకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తోంది. అందుకే తన కోసం ఓ కథ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ప్రారంభించనున్న బోయపాటి.. చిరుకోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిని కూడా ఒకేసారి చేస్తాడని తెలుస్తోంది.