Showing posts with label Twitter. Show all posts
Showing posts with label Twitter. Show all posts

03/09/2016

ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల రికార్డు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగేంటో మరోసారి రుజువైంది. పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో ఇండియాలో ట్విట్టర్ రికార్డు నమోదైంది. ఇండియాలో అతి పెద్ద ట్విట్టర్ ఫ్యాన్ ట్రెండును పవన్ కళ్యాణ్ అభిమానులు సొంతం చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ మీద గత నెల రోజుల్లో ఏకంగా 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి.

ఇండియాలో మరే ఫ్యాన్ ట్రెండ్ విషయంలోనూ ఇన్ని ట్వీట్లు నమోదు కాలేదు. ఇప్పటిదాకా రికార్డు అజిత్ అభిమానుల పేరిట ఉంది. అజిత్ పుట్టిన రోజు శభాకాంక్షలు చెప్పేందుకు పెట్టిన హ్యాష్ ట్యాగ్ మీద 4.3 లక్షల ట్వీట్లు నమోదవగా.. అజిత్ సినిమా ఎన్నై అరిందాల్ హ్యాష్ ట్యాగ్ కు 5.3 లక్షల ట్వీట్లు వచ్చాయి. దాన్ని హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ దాటేసింది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని రోజుల ముందు నుంచి అభిమానుల హంగామా మొదలైంది. ఇక నిన్న రాత్రి నుంచి అయితే ట్విట్టర్లో బర్త్ డే విషెస్ పోటెత్తాయి. టాలీవుడ్కు చెందిన ప్రముఖులందరూ పవన్కు విషెస్ చెప్పారు. ఇక అభిమానులైతే పవన్ గురించి అనేక విశేషాలు పంచుకుంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు పెట్టారు. మొత్తంగా పవన్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు 6 లక్షలు దాటుతాయని అంచనా వేస్తున్నారు.