Showing posts with label Sunil. Show all posts
Showing posts with label Sunil. Show all posts

24/06/2016

కుర్ర భామలతో చిందులేయిస్తున్న మెగాసాంగ్స్

మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పాటలు.. ఆడియన్స్ కి అభిమానులకే కాదు.. ఎంతటి వారినైనా కాలు కుదురుగా ఉండనివ్వవని ఒప్పుకోవాల్సిందే. ఆ ట్యూన్స్.. వాటిలో మెగాస్టార్ వేసే స్టెప్పులు చూసినా.. అవి మదిలో మెదిలినా మనసులోనే ఎగిరి గంతులేయడం ఖాయం. మెగాస్టార్ పాటలకు స్టేజ్ లపై స్టెప్పులు వేయడం కొత్తేం కాదు. 

చాలామంది డ్యాన్సర్లే కాదు.. పలువురు హీరోలు కూడా ఇలా చిందులేసి చూపించిన వారే. మెగా రీఎంట్రీ ఫిక్స్ అయినప్పటి నుంచి ఈ జోరు మరింతగా పెరిగింది. ఇప్పుడు మెగాస్టార్ పాటలకు అందాల భామలు కూడా తెగ డ్యాన్సులు వేసేస్తున్నారు. ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ మెగాస్టార్ సాంగ్స్ కి డ్యాన్సులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు.. ఇంద్ర సినిమాలో చిరు వేసిన వీణ స్టెప్పును యథాతథంగా చూపించేసి ఔరా అనిపించేసింది. ప్రగ్యా జైస్వాల్ కూడా ఇలాంటి ఫీట్ ను ఇప్పటికే చేసేసిన విషయం ఆడియన్స్ కు ఇంకా గుర్తుంది. 

ఇప్పుడు మన్నారా చోప్రా వంతు. సునీల్ హీరోగా వస్తున్న జక్కన్న మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇవాళ జరగనుంది. దీనికి మెగాస్టార్ ముఖ్య అతిథిగా రానుండడంతో.. మెగాస్టార్ పాటలకు చెందిన ఓ మెడ్లేకు మన్నారా చోప్రా తెగ ప్రాక్టీస్ చేసేసింది. ఇంతమంది హీరోయిన్లు ఒకేసారి మెగాసాంగ్స్ పై పడ్డానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారా