Showing posts with label MegastarFM. Show all posts
Showing posts with label MegastarFM. Show all posts

26/07/2016

'మెగాస్టార్' రేడియో తెగ నచ్చేసిందట

మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ.. తమకు వీలుచిక్కినా లేదంటే అవకాశం వచ్చినా.. 'మెగాస్టార్ చిరంజీవి' గురించి చెప్పడానికి ఇష్టపడతారు. పవన్ నుండి వరుణ్ తేజ్ వరకు.. అందరూ ఇదే తంతు. వీరందరూ కూడా మెగాస్టార్ కు మెగా ఫ్యాన్సే. ఇదిగో ఇవాళ తన ఫ్యానిజం ఎలా ఉంటుందో చూపించేశాడు మెగా ప్రిన్స్. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ''మిష్టర్'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఈ కుర్రాడు ఏమంటున్నాడంటే..

వరుణ్ తేజ్ రోజూ హోటల్ నుండి షూటింగ్ స్పాటుకు వెళ్ళడానికి ఒక కారు వాడుతున్నాడు. ఆ కారులో మనోడు ఎఫ్.ఎం. రేడియో వింటుంటాడు. ఇంతకీ మనోడు వినే రేడియో ఛానల్ పేరేంటో తెలుసా? ''మెగాస్టార్ FM'' స్పెయిన్లో ఈ రేడియో బాగా పాపులర్. ఒకవేళ అది పాపులర్ కాకపోయినా కూడా.. ఆ ఛానల్ వారు మెగాస్టార్ అనే పేరును పెట్టుకున్నారు కాబట్టి.. ఆ ఛానలే వింటాను అంటున్నాడు వరుణ్ తేజ్. దటీజ్ మెగాస్టార్ లవ్ అంటూ చెప్పుకొచ్చాడు కూడా. 

శ్రీను వైట్ల డైరక్షన్లో రూపొందుతున్న ''మిష్టర్'' సినిమా షూటింగ్ దాదాపు స్పెయిన్లోనే జరుగుతుందట. త్వరలోనే హీరోయిన్లు లావణ్య త్రిపాఠి మరియు హెబ్బా పటేల్ స్పెయిన్ చేరుకుంటారని తెలుస్తోంది. అది సంగతి.